పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్ తమన్నా.సీనియర్ యాక్టర్ అయి ఉండీ కూడా ఇప్పటికి సన్నని నడుమూతో..లేత అందాలతో తన అభిమానులని కట్టిపడెస్తు రక రకాల సినిమాల్లో నటించే ఆఫర్లు అందుకుంటుంది . ప్రస్తుతం కాలంలో రోజుకో హీరోయిన్ పుట్టుకోస్తున్నపటికి వారితో పోటి పడుతూ తెలుగు హిందీ తమిళ పరిశ్రమలో వరుస ఆఫర్ లతో బిజీ గా ఉన్నారు. హ్యాపీ డేస్ తో తెలుగు ప్రేక్షకులకు దేగ్గరైన తమన్నా భారి సంఖ్యలో ప్రేక్షకులను సొంతం చేసుకుంది.
వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా కాదనకుండా సద్వినియోగ పరచుకుంటు ఉంది తమ్మన. తాజాగా ఆమె నటించిన సిటీ మార్ చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంపత్ నంది డైరెక్షన్ చేశాడు , ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ రన్ అవుతుంది గనుక ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇదే ఈ సినిమాకు సక్సెస్ నిచ్చిందని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. వినాయక చవితి స్పెషల్ గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయి భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా గోపీచంద్ కు మంచి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో తమన్నా చేసిన పాత్రను ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు.
అయితే తాజాగా ప్రపంచమంతటా కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న మాస్టర్ చెఫ్ షో ను తెలుగులో తీస్తుండగా తమన్నా దానికి హోస్ట్ గా ఉన్నారు ఇప్పటికే గ్యాప్ లేకుండా ఒకటి వెనుక మరొకటి వేర్వేరు ఛానల్ లో మంచి సక్సెస్ రేటింగ్ సాధించిన మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో ల మధ్య మాస్టర్ చేప్ కూడా రావడం విశేషం. అయితే ఇతర షో లు వచ్చే టైంకి ఈ షో కూడా రావడం మూలంగా వేరే షో ల తాకిడికి మాస్టర్ షో నిలబడ లేక పోతోంది.
అయితే మాస్టర్ చేప్ షో నిర్మాతలు తమన్నా హీరోయిన్ గనుక భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటు అసలే ఫ్లాప్ దిశగా వెళ్తున్న షో లో ఇలాంటి భారీ వేయం చేయలేమని తమన్నాకి బదులు జబర్దస్త్ యాంకర్ అనసూయ తో హోస్టింగ్ చేయించలనుకుంటున్నటూ నిర్ణయం తీసుకున్నారట. అయితే తమన్నా తనను తిసేసినందుకు అవమానం గా ఫీల్ అవుతూ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది