టాలివుడ్ సినీయర్ హీరోయిన్స్ లో తనకు అంటూ ఒక మంచి నటిగా పేరుపొందిన హీరోయిన్ తమన్నా భాటియా. ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా నార్త్ లో తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “హ్యాపీ డేస్” సినిమా లో పరిచయమైన తమన్నా బాహుబలి మరియు సైరా వంటి పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా స్థానం సంపాదించింది.
ప్రస్తుతం తన చిత్రాలతో ఈ మిల్క్బ్యూటీ చాలా బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తో అటు మేకర్స్ ని ప్రేక్షకుల్ని తన అందంతో ఆకట్టుకుంది. తన రీసెంట్ ఫోటోషూట్ లో తన అందం తగ్గడం లేదని ఇంకా పెరుగుతుందని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె నటించిన సిటీ మార్, మాస్ట్రో ,మరియు దట్ ఇస్ మహాలక్ష్మి సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తను నటించిన సిటీ మార్ సినిమాలో నుంచి జ్వాల రెడ్డి అనే పాట యూ ట్యూబ్ లో కొన్ని మిలియన్ల వీళ్లను సంపాదించింది. అలానే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా ఈ మెయిల్ బ్యూటీ యాక్టింగ్ లో చాలా బిజీగా ఉంది.
ఈ శీతాకాలంలో మరో రెండు సినిమాలకు ఈ మిల్క్బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శీతాకాలంలో ఆ రెండు చిత్రాలు సెట్స్ పైకి రానునునై. ఒకవైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ తో చాలా బిజీ గా ఉన్న తమన్నా భాటియా. హాలీవుడ్ లో పాపులర్ షో అయిన కుకరి షో ను బుల్లి తెర మీదకు తీసుకు రానున్నది.తను చేస్తున్న చేయబోతున్న ప్రతి ఒక ప్రాజెక్టును తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పోస్టులు వేస్తూ ఉంటుంది.
తమన్నా కి చేపల పులుసు అంటే చాలా ఇష్టం:
హాలీవుడ్ లో పాపులర్ షో పలు భాష ళ్లో ప్రసారమయ్యే కుకరీ షో మన తెలుగు వర్షన్ లో ఈ మిల్క్ బ్యూటీ నీ పోస్ట్ చేస్తున్నది. అందులో భాగంగా మేకర్స్ ఒక చిన్న ప్రోమో విడుదల చేశారు అందులో తమన్నా కు ఆంధ్ర వంటలు అంటే అందులో నువ్వు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.
తను పుట్టి పెరిగిన ప్రాంతీయ వంటల కంటే ఆంధ్ర మరియు హైదరాబాద్ వంటలను చాలా ఇష్టపడుతుంది అని చెప్పింది .తనకు హైదరాబాద్లోని దమ్ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. తను సెట్లో లంచ్ బ్రేక్ లో తనకు కావాల్సిన దమ్ బిర్యాని మరియు చేపల పులుసు తెచ్చుకొని మరి ఇష్టంగా తింటుంది. షూటింగ్లో భాగంగా ఎక్కడికి వెళితే అక్కడి ప్రాంతీయ వంటకాలను తాను అలవాటు చేసుకుంటా అని చెప్పింది తామ్మన. తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫేవరెట్ ఫుడ్ ని తానే స్వయంగా వంట చేసి పెడుతుంది.