తెలుగు ప్రేక్షక ప్రపంచానికి మంచి లవ్ అండ్ డ్రామా సినిమాలు అందించిన హీరోలలో ఒకడు తరుణ్ . 1990 నుండి 2018 వరకు రకరకాల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఈయన ప్రస్తుతం తన బిజినెస్ ల తో చాలా బిజీగా ఉన్నారు అయితే తనకు ఈ విధమైనటువంటి యాక్టింగ్ స్పూర్తిని ఇచ్చింది మాత్రం తన తల్లి రోజారమణి గారే అని చెప్పవచ్చు. ఎందుకంటే తాను కూడా ఒకప్పటి గొప్ప ఆక్టర్ లలో ఒకరు గనుక.
రాజమండ్రిలో లో ఒక తెలుగు కుటుంబం లో ఏకైక కూతురు గా జన్మించిన రోజా రమణి గారి తండ్రి జర్నలిస్టుగా పని చేస్తూ ఉండేవాడు అయితే తాను ఆరు నెలల చిన్న బిడ్డ గా ఉన్నప్పుడే తన తండ్రికి మద్రాస్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల తమిళ వాతావరణంలో పెరిగింది.
మద్రాసు వెళ్లిన రోజా రమణి గారు తన ఏడేళ్ళ వయస్సు నుండే సినీ పరిశ్రమలో నటించడం ప్రారంభించింది మన అందరికీ సుపరిచితమైన భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుని గా నటించింది రోజా రమణి గారే . 1967 లో AVM ప్రొడక్షన్ ద్వారా నిర్మితమైన ఈ సినిమా పూర్తి కలర్ సినిమాగా తెరకెక్కింది ఆ కాలంలో ఇది మంచి సక్సెస్ గా నిలిచింది.
ఆ తర్వాత 1970 నుండి 1980 వరకు ఒక దశకం పాటు తమిళ తెలుగు కన్నడ మలయాళం సినిమాలలో ఆమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన 13వ ఏట చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ సినిమా చెంపర్థీ లో లీడ్ రోల్ లో నటించింది ఆ సినిమా గొప్ప విజయం సాధించి రోజా రమణినీ ట్రెండ్ సెటర్ ను చేసింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో లో కన్నె వయసు అనే పేరుతో రోజా రమణి ని లీడ్ రోల్ గా పెట్టి రీమేక్ చేయడం జరిగింది ఇదే సినిమాను తమిళంలో కూడా పరువ కాలం పేరుతో రీమేక్ చేశారు. ఇది ఆ కాలంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
రోజా రమణి గారు తమిళ్ తెలుగు కన్నడ మలయాళం మరియు ఒరియా భాషలలో సుమారు 300కు పైగా సినిమాలలో నటించింది. ఇదేగాక ఆ కాలంలోని లీడ్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్తూ ఉండేది అలాగా సుమారు నాలుగు వందలకు పైచిలుకు సినిమాలలో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. తాను సినిమా పరిశ్రమకు చేసిన విలువైన సేవలను గుర్తించిన తెలుగు సినీ పరిశ్రమ ఆమెను రకరకాల అవార్డులతో సత్కరించింది. రమణి గారు కేవలం సినిమాల్లోనే కాక బ్లూ క్రాస్ లో ఒక సభ్యురాలిగా ఉంటూ అనేకమైన సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు.
రోజా రమణి గారు 1981లో అప్పటి సినిమా నటుడు చక్రపాణిగారి ని వివాహం చేసుకున్నారు ఆయన ప్రస్తుతం ఈ టీవీ ఒడియా కు అధినేతగా ఉన్నారు. వీరిద్దరికి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. వారి అబ్బాయి మనందరికీ ఎప్పటినుండో పరిచయం ఉన్న యాక్టర్ తరుణ్ కాగా తమ కూతురు అమూల్య మాత్రం ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తోంది.
గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వీరినీ తాజాగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కి అతిథులుగా ఆహ్వానించబడ్డారు. అక్కడ ఆలీతో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆ నాటి తీపి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ సరదాగా గడిపారు.. ఇదే క్రమంలో కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు.
స్విజర్లాండ్ వెళ్ళాక ఒక రోజు తండ్రి కొడుకులు చక్రపాణి మరియు తరుణ్ లు భక్తి పారవశ్యంలో మునిగి టవల్ని లుంగీ లాగా చుట్టుకొని పూజలు చేస్తూ ఇండియా నుంచి తెచ్చుకున్న కర్పూరం బిళ్ళలు అగరవత్తులు చాలా ఎక్కువగా కాల్చేశారని దాంతో రూమ్ లో ఉన్న ఫైర్ డిటెక్టర్ అలారం మోగడంతో పోలీసులు వారు నా ఇంటికి వచ్చారని చెప్పింది. విదేశాల్లో ఉన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఈ తీపి జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేని రమణి రోజా గారు అన్నారు. అలాగే తన చిన్నతనములో పౌడర్ తినే అలవాటు కూడా తను బ్రతికున్నంత కాలం గుర్తుచేసుకునే చిన్ననాటి మధుర జ్ఞాపకం అని తెలియజేశారు.
అయితే తమ కుటుంబానికి ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావు గారితో మంచి అనుబందం ఉందని ఈటీవీ లో లో ఆలీ తో సరదాగా షో ద్వారా తెలియజేశారు.