ఆ పని చేయడం కంటే నటించడమే బెస్ట్ అంటూనే కొత్త అవతారం ఎత్తిన తేజస్వీ

News

నటి తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ఆమెను ఫాలో అయ్యే అందరికీ బాగా తెలుసు.అయితే ఈమె సినీమా కెరీర్ బిగ్ బాస్ కి ముందు బిగ్ బాస్ తరువాత అనేలా మారిపోయింది. బిగ్ బాస్ షో లో పాలుగొనడానికి ముందు ఆమెకు విపరీతంగా సినిమా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా మరియు సపోర్టింగ్ పాత్రల్లోనూ నటించారు. అయితే ఏ ముహూర్తం లో ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఆడుగుపెట్టిందో కానీ తరువాత ఆమె కెరీర్ మొత్తం డౌన్ అయిపోయింది. బిగ్ బాస్ షో అయిపోయిన తరువాత కూడా ఆమె ఇంత వరకు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది.అయితే ఆ మధ్య కమిట్మెంట్ అనే మూవీ తో మల్లి ఇండస్ట్రీ లోకి వస్తున్నట్లు తెగ హంగామా చేసింది. కానీ ఆ మూవీ రిలీజ్ కాకముందే ఆ ప్రాజెక్ట్ కనబడకుండా పోయింది.

tejaswi-madivada

ఈ చిత్రం ప్రతిసారి వాయిదా పడుతూనే వచ్చింది.అయితే ఇప్పుడు ఎక్కడా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ కనబడటంలేదు.అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో ఆమె చాలాసార్లు తన రియల్ లైఫ్‌లో జరిగిన నిజ సంఘటనలే ఈ మూవీలో ఉన్నాయని, ప్రతీ ఒక్క అమ్మాయి ఈ మూవీని తప్పకుండ చూడాలి అని తేజస్వీ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వీ ఇప్పుడు కొత్త పనిని మొదలు పెట్టారు.ఇక నుండి ఆమె మనకు కొత్త అవతారంలో కనిపించనుంది.

యాక్టర్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా కొత్త వృత్తిని మొదలు పెట్టిన్నట్లు ,అందుకు తగట్లు ఆమె మారినట్టున్నారు. ప్రజెంట్ ఆమె అనీష్ కురివిల్లా దర్శకత్వంలో రాబోతోన్న ఒక షార్ట్ ఫిలిం కోసం తేజస్వీ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారింది.అయితే ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను అని తన సోషల్ మీడియా అకౌంట్ లో చెప్పారు. ఒక యాక్టర్ గా ఉండడం వాళ్ళ కేవలం యాక్టింగ్ మీదే ధ్యాస ఉంటుందని, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడంతో మూవీస్ కి సంబంధించిన ప్రతీ చిన్న అంశం పై అవగాహన ఏర్పడుతోందని అన్నారు.అయితే యాక్టర్ కంటే ఏడీగానే ఎక్కువ కష్టం, బాధ్యత, పని ఉంటుదని తెలిపారు.

పానీపూరి అమ్ముకునేవాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్న – తేజస్వి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *