సుమారు దశక కాలం కిందట ఒక ఊపు ఊపిన టాప్ హీరోయిన్ లలో ఒకరు త్రిష , ఆమె తమిళనాడు వస్తవ్యూరలైనప్పటికి తన నటనతో అచ్చం తెలుగు అమ్మాయిలాగా అనిపించేది. త్రిషను తెలుగు ప్రేక్షకులు అమితంగా అభిమానించి ఆదరించారు. వర్షం సినిమా తర్వాత భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నది దాంతో అభిమానుల అభిరుచికి అనుగుణంగా తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో నటించడానికి ఆఫర్లు అందుకుంది. తెలుగు , తమిళం తో పాటు హిందీ సినిమాల్లో కూడా నటింఛారు త్రిష. తనకి ఉన్న క్రేజ్ వల్ల ఆమె నటించిన కొన్ని సినిమాలు రీమేక్ అవ్వడటం కూడా చూశాము.
తమిళనాట మోడలింగ్ తో ప్రారంభమై జోడి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు, ఇక తెలుగులో అయితే నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కటిగా తన కష్టంతో సినిమా పరిశ్రమలు ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు 40 ఏళ్ల ఉన్న త్రిష సినిమాల్లోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
తన ఇరవై ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎన్నో ఒడిదుడుకులను కష్టనష్టాలను అపోహలను నిందలను ఎదుర్కొంటూ తన ప్రయాణం కొనసాగిస్తోంది, త్రిష కు 40 ఏళ్లు ఉన్నప్పటికీ కూడా సినిమాలలో మంచి పాత్రలను పోచించి అక్కటుకుంటుంది ప్రజలను ఆకట్టుకుంటోంది.

తాన కెరియర్ లో ఎదుర్కొన్న వివాదాల్లో ముఖ్యమైనది ప్రజల మధ్యలో విపరీతంగా చక్కర్లు కొట్టిన విషయం తనను ఒక డైరెక్టర్ షూటింగ్ జరుగుతుండగా అందరి ముందు కొట్టడమే. గతంలో త్రిష ఒక సినిమా ఆఫర్ అందుకున్నారు దాంట్లో సంప్రదాయమైన దుస్తులతో పూజ చేసే సన్నివేశం ఒకటి చిత్రించల్సి ఉండగా, త్రిష చిన్న మిడ్డి ఫుల్ ఎక్స్పోజ్ చేస్తూ షూటింగ్ లొకేషన్ కి వచ్చారు, దాంతో డైరెక్టర్ కి చిర్రెత్తుకు వచ్చి త్రిషపైన కోపంగా ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలీదా. బుర్ర లేకుండా సంప్రదాయ పద్ధతిలో రవల్సినదానివి ఇట్లా ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తావా అంటూ త్రిష పై చేయి చేసుకున్నారు. దాంతో త్రిష కొప్పడి, అందరి ముందు కొట్టేసరికి తనను అవమాన పర్చినట్టుగా భావించి సినిమా మద్దెలోనే షూటింగ్ వదిలి వెళ్ళిపోయింది ఇంక ఆ తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్ సినిమాలో అస్సలు నటించలేదు త్రిష.