జోమాటో : సైకిల్ పై డెలివరీ ..! అతని కష్టాన్ని చూసి ప్రజలే బైక్ కొనిచ్చారు…

News

ఈ మహమ్మారి హైదరాబాద్‌లో చాలా మంది జీవితాలను అతలాకుతలం చేసింది. తల్లి మరియు తండ్రితో సహా తన 7 సభ్యుల కుటుంబాన్ని పోషించే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి గురించి ఒక కథ వెలుగులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో, రాబిన్ ముఖేష్ తన ఆహారాన్ని జోమాటో ద్వారా వేగంగా పొందటం చూసి ఆశ్చర్యపోయాడు. హైదరాబాద్‌లో భారీగా వర్షం పడుతోంది మరియు రాబిన్ ఆలస్యం అవుతుందని మాత్రమే ఊహించాడు.

సైకిల్‌పై ఆహారాన్ని అందించడానికి వచ్చిన డెలివరీ బాయ్ మొహద్ అకీల్‌ను ఆయన ప్రశంసించారు. ఓల్డ్ సిటీ కి చెందిన తలాబ్ కట్టా నివాసి అయిన 21 ఏళ్ల అకీల్ గురించి అడిగినప్పుడు, అతను తన కుటుంబానికి ఏకైక బ్రెడ్ విన్నర్ అని తెలిసింది. లాక్డౌన్ కి ముందు అకీల్ షూ మేకర్ అయిన తన తండ్రికి మద్దతుగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు మరియు 7 మంది సభ్యుల కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవాడు. లాక్డౌన్ విధించడంతో, కుటుంబం యొక్క పెద్ద కుమారుడు అకీల్ తన పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు.

 

అతని తండ్రి నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఇటీవల, అతను జోమాటోలో చేరాడు మరియు నెలకు రూ .8,000 సంపాదిస్తూ తన సైకిల్‌పై ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించాడు. రాబిన్ ,అకీల్ కథను ట్విట్టర్‌లో పంచుకున్నాడు మరియు త్వరలోనే చాలామంది సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.

“డెలివరీ బాయ్ డెలివరీని తీసుకెళ్లడానికి నన్ను రమ్మని అడిగాడు. నేను కిందకు వెళ్ళినప్పుడు అతను కేవలం 20 నిమిషాల్లో, వర్షంలో తడుస్తు తొమ్మిది కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి నా వద్దకు వచ్చాడని గమనించాను. నేను అతని ఫోటో ను ఒక సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్ చేసాను మరియు దాని సభ్యులు స్పందిస్తూ, అకీల్ కోసం ఏదైనా తప్పకుండా చెయ్యాలని అన్నారు, “అని ఐటి ప్రొఫెషనల్ మిస్టర్ ముఖేష్ పిటిఐకి చెప్పారు.

తన వృత్తి పట్ల అంకితభావంతో డెలివరీ చేస్తున్న వ్యక్తి కి బహుమతిగా ఇవ్వడానికి బైక్ కోసం నిధులు సేకరించాలని ఆ గ్రూప్ సభ్యులు నిర్ణయించారు.

‘ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ క్లబ్’ కు చెందిన రవి కాంత్ రెడ్డి అకీల్ కోసం బైక్ తీసుకురావాలని ప్రచారం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే, ప్రచారం ద్వారా రూ .73 వేలకు పైగా వసూలు చేయగలిగారు, ఇది వారు అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ. శుక్రవారం, ఇంజనీరింగ్ చదువుతున్న అకీల్ పనిని సులభం చేయటానికి సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ 100, హెల్మెట్ మరియు రెయిన్ కోట్ అందించారు. ప్రచారం ద్వారా వచ్చే అదనపు డబ్బును కూడా ఆయన అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *