వదినమ్మ’ పరువు గోవిందా..! క్యాష్ షో లో చీపురుతో మహేశ్వరి రచ్చ..!

News

వదినమ్మ మా టీవీలో ప్రసారమవుతున్న ఒక టెలివిజన్ సీరియల్. ఈ సీరియల్‌లో ప్రధాన తారాగణం రఘు రామ్‌గా ప్రభాకర్, సీతగా సుజిత, శ్రావన్‌గా లక్ష్మణ్, శైలు పాత్రలో మహేశ్వరి, సిరి పాత్రలో ప్రియాంక, భరత్ పాత్రలో చరణ్‌రాజ్, గణేష్ రెడ్డి పాత్రలో నాని ఉన్నారు. ఇది పాండియన్ స్టోర్స్ అనే తమిళ సిరీస్ రీమేక్, ఇది కుటుంబం యొక్క ప్రాముఖ్యతను మరియు వారి సంబంధాలను వివరిస్తుంది. రఘు రామ్ కుటుంబానికి పెద్ద.

అతనికి ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణ్, భారత్ మరియు నాని ఉన్నారు. ఈ నలుగురు సోదరులు మరియు వారి తల్లి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. రఘు సీతను వివాహం చేసుకుంటాడు. సీత పిల్లలు పుట్టకూడదని నిర్ణయించుకుంటుంది , రఘు సోదరులను చూసుకోవాలనుకుంటుంది.

ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ చూసుకుంటుంది మరియు వారి కోసం ఎల్లప్పుడూ సేవ చేస్తుంటుంది. అప్పుడు, లక్ష్మణ్ మరియు భరత్ వరుసగా శైలు మరియు సిరిని వివాహం చేసుకుంటారు. ఇప్పుడు, ఈ నాటకం సీత ఎలాంటి సమస్యలను లేకుండా కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది మరియు ఎలా అన్ని అడ్డంకులను ఎదుర్కొంటుంది ఎలా కుటుంబాన్ని సంతోషంగా నడుపుతుంది అనే స్టోరీ లైన్ కలిగి ఉంటుంది. ఈ సీరియల్ లో ప్రతి పాయింట్ ఒక సాధారణ కుటుంబా నికి సంబంధించినది గా కనిపిస్తుంది కాబట్టి ఈ సీరియల్ కు విశేష ప్రజాధారణ లభిస్తుంది.

అయితే ఈ వారం లో ప్రసారం కానున్న క్యాష్ ప్రోగ్రాం యొక్క ప్రోమో ఇటీవలే విడుదల అయ్యింది.అందులో వదినమ్మ టీం చేస్తున్న రచ్చ మాములుగా లేదంటూ సోషల్ మీడియా లో జనం కామెంట్స్ పెడుతున్నారు. అందులో మహేశ్వరి తన కూతురు యొక్క బాటలు వేసుకొస్తుంటుంది అంటూ రాజేష్ చేసిన కామెంట్స్ కి అందరూ తెగ నవ్వుకుంటారు.తర్వాత సుమా కూడా మహేశ్వరిని నిజంగానే చిన్న పిల్ల లాగే ఉన్నావ్ అంటూ సెటైర్లు వేసింది.

తర్వాత షో లో వదినమ్మ టీం కు చీపురు అమ్మే టాస్క్ ఇచ్చింది అందులో మహేశ్వరి చీపురును అమ్ముతూ దానితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని బయట పెట్టింది. ఆలస్యంగా భర్త ఇంటికి వస్తే చీపురుతో ఎలా సమాధానం చెప్పొచ్చో చక్కగా చెప్పింది. తర్వాత రాజ్ ను రాజేష్ ను చీపురుతో కొడుతూ వదినమ్మ టీం పరువు తీసింది మహేశ్వరి.ఇంకా ఈ ప్రోమో చూసిన నెటిజన్లు వదినమ్మ సీరియల్ టీం ను ఆడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *