ఢీ డాన్స్ షో గురించి ఎన్ని చెప్పిన తక్కువే. ఎక్కడెక్కడి నుండో టాలెంట్ ను ప్రూవ్ చేసుకుందాం అని కాంటెస్టెంట్ లు వస్తుంటారు. ఎంతో మంది కి లైఫ్ కూడా ఇచ్చింది ఢీ షో. ఢీ షో నుండి ఇప్పుడు వివిధ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న చాలామంది కాంటెస్టెంట్ లను మనం చూసాం.
యష్ మాస్టర్ కూడా అందులో ఒకడు. ఎక్కడో సైడ్ డాన్సర్గా చేసే అతను ఇప్పుడు సినిమాల్లో హీరోలతో స్టెప్పులు వెయిస్తున్నాడు అంటే అదంతా ఢీ షో పుణ్యమే అని ఎన్నోసార్లు యశ్వంత్ మాస్టర్ చాలా ఇంటర్వూస్ లో చెప్పాడు. అయితే అతనొక్కడే కాదు ఎంతో మంది ఢీ కాంటెస్టెంట్ లు మనకు తెలుసు వాళ్ళందరూ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా గుర్తింపు సంపాదించి ముందుకు దూసుకుపోతున్నారు. అల్ ఇండియా లెవెల్ లోనే ఢీ షో కి మంచి గుర్తింపు ఉంది.

అందులో డాన్సర్స్ మాములు టాలెంటెడ్ కాదు అని ఇప్పుడు ఇండియా మొత్తానికి తెలుసు. అంతలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఢీ షో. అయితే ఆ షో ని మరింత ఆకర్షణీయంగా చేయాలని నిర్వాహకులు తరుచు వినూత్నమైన ఐడియాస్ తో ప్రతీ ఎపిసోడ్ లో ఏదో యూనిక్నెస్ కోరుకునే వీక్షకులకు తగ్గట్లుగా వారి ఎపిసోడ్స్ ను తయారు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ వారం రాబోయే ఎపిసోడ్స్ లో సౌత్ హీరోస్ అందరిని వారి పర్ఫార్మెన్స్ లో చూపించే ప్రయత్నం చేశారు.

దీనికి తగ్గట్లు జెడ్జులు , యాంకర్ మరియు మెంటర్లు అందరూ రకరకాల నటుల వేశాలను వేసుకున్నారు. అందులో గణేష్ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ లో కనిపించాడు. ఇక సుధీర్ చిరంజీవి ఇంద్ర గెటప్ వేసిన కూడా చేసింది మాత్రం రజినీకాంత్ పెర్ఫార్మన్స్. నిజానికి సుధీర్ తన నటనతో అచ్చు గుద్దినట్లు గా రజినీకాంత్ గారిని దించేశాడు.ఇది అలా ఉంటే ఆ షో లో వకీల్ సాబ్ డాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని కంటతడి పెట్టించేశారు కంటిస్టెంట్.

ఆర్ యు వర్జిన్ అనే వకీల్ సాబ్ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ అగ్రేషన్ కళ్ళకు కట్టినట్లు గా చూపించేసారికి స్టేజి మొత్తం జోస్ నిండిపోయింది. దాంతో ఎమోషనల్ అయిపోయారు గణేష్ మాస్టర్ , చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి రేప్ చేస్తుంటారు అసలు వాళ్లలో ఏం కనిపిస్తుంది రా మీకు అని తిడుతూ ఏడ్చేశాడు. పక్కన ఉన్న ఇద్దరు మహిళ జడ్జిలు గణేష్ మాస్టర్ ను ఓదార్చే ప్రయత్నం చేశారు.

కాబట్టి ఈ వారం రాబోయే ఎపిసోడ్ మాములుగా అస్సులు ఉండదని ఈ ప్రోమో చూసాక అర్ధం అవుతుంది అంటున్నారు అభిమానులు. కొంతమంది అయితే ఇప్పడినుండే ఎదురుచూపులు మొదలెట్టేశారు ఆ ఎపిసోడ్ కోసం. ఈ ఎపిసోడ్ లో ఇంకో హైలైట్ సుధీర్ పరఫార్మన్స్ అని చెప్పుకుంటున్నారు అందరూ. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.