జబర్దస్త్ లో వకీల్ సాబ్ సూపర్ ఉమెన్ సందడి..!

News

చిన్న చిన్న ఆర్టిస్టులకి జబర్దస్త్ కామెడీ షో ఒక మంచి ప్లాట్ఫార్మ్ లాగా మారింది.సినిమాలలో ప్రముఖ యాక్టర్స్ దెగ్గర్నుండి మొదలు పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు జబర్దస్త్ షో కి వచ్చి సందడి చేస్తుంటారు.అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ షో యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియోలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు వకీల్ సాబ్ చిత్రం ద్వారా సూపర్ వుమన్ గా పేరు తెచ్చుకున్న లిరీష జబర్దస్త్ స్టేజి పైన కనిపించారు.టీవీ సీరియల్స్ లో ఎక్కువగా విలన్ పాత్రలో నటించిన లిరీషకు వకీల్ సాబ్ మూవీలో కీలకమైన పోలీసు పాత్ర పోషించే అవకాశం వచ్చింది.ఆమెకు ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు జబర్దస్త్ లోకి కూడా ఆహ్వానించారు.

వకీల్ సాబ్ సినిమాలో సూపర్ వుమన్ అనగానే ఆ సినిమా చూసినవారాందారు వెంటనే లిరీష అని టక్కున చెప్పేస్తారు.ఆ మూవీలో కోర్టు సీన్లో ఆమెకు పవన్కళ్యాన్ కు మధ్య జరిగే కొద్దిసేపు సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది మరియు ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు థియేటర్లలో అభిమానులు ఈలలతో గోల గోల చేసేవారు. ఈ సీన్లో పవన్ కళ్యాణ్ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అభిమానులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.

ఆ సీన్ లో తను జెట్ స్పీడ్ లో కోర్టులోకి వచ్చానని సమాధానం ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన స్టైల్ లో ఆమెకు సూపర్ కౌంటర్ డైలాగ్ వదులుతాడు.వీరిద్దరి మధ్య జరిగిన సన్నివేశం అభిమానులకు చాలా నచ్చింది.సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు కావస్తున్నా ఇంకా ఈ సీన్ ను చాలా మంది మర్చిపోలేకపోతున్నారు.అల్వాల్ నుండి మొయినాబాద్ కి 15 మినెట్ మే వచ్చిండ్రామా మీరు.. సూపర్ వుమన్ అని కోర్ట్ సీన్ లో ఆమెని ప్రశ్నిస్తాడు.అప్పుడు ఆమె ఏదైతే అది అయితది అని జెట్ స్పీడ్ లో వచ్చిన సర్ అని సమాధానం ఇస్తుంది.అప్పుడు థియేటర్ లో జనాలకు విపరీతంగా ఈ సీన్ నచ్చి ఎన్నో మీమీస్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

నిజానికి ఆ మూవీలో ఆ సీన్ ముందు లేదని ఆమె అన్నారు.సూపర్ వుమన్ డైలాగ్ ని పవన్ కళ్యాణ్ గారే సృష్టించారు అని అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చిందని ఆమె ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆమెను తన పేరుతో కాకుండా సూపర్ వుమన్ అని పిలుస్తున్నారని కూడా ఆమె అన్నారు.

నిజానికి ఆమె పవన్ కళ్యాణ్ గారితో ఈ మూవీ చేయడంకంటే ముందే చిరంజీవితో 15 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన స్టాలిన్ సినిమాలో నటించింది. కానీ అప్పుడు రాని గుర్తింపు వకీల్ సాబ్ అనే ఈ మూవీతో వచ్చిందని ఆమె అన్నారు.ఆమె స్టాలిన్ తర్వాత కూడా ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్ కూడా చేసింది.అయితే ఇటీవలే ఆమె జబర్దస్త్ షో లో పార్టీసిపేట్ చేసే అవకాశాన్ని పొందుకుంది. 15 నిమిషాల్లో వెళ్లిపోయే సూపర్ వుమన్ ని రా అంటూ జబర్దస్త్ స్కిట్ లో రెచ్చిపోయింది.ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *