COVID-19 మహమ్మారి యొక్క ప్రాణాంతకమైన రెండవ వేవ్ కారణంగా చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయిన సమయంలో, మధ్యప్రదేశ్ కు చెందిన CBSE 10 వ తరగతి టాపర్ అయిన వనిషా పాఠక్ అలాంటి అనేక మంది అనాథ పిల్లలకు ఆశా కిరణంగా నిలిచారు. వనిషా యొక్క కఠోరశక్తి, అంకితభావం మరియు కష్టపడి పని చేయడం వల్ల ఆమె సిబిఎస్‌ఇ 10 వ తరగతి బోర్డ్ పరీక్షలలో 99.8% మార్కులు సాధించింది. ఇంకేముంది, ఆమె ఇప్పుడు రాబోయే కాలంలో చాలామందికి ఒక రోల్ మోడల్ గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన జితేంద్ర కుమార్ పాఠక్ మరియు సీమా పాఠక్ ల కుమార్తె వనిషా. ఆమె CBSE బోర్డ్ పరీక్ష జరగడానికి కొన్ని నెలల ముందుగానే కోవిడ్ -19 కారణంగా ఇద్దరు తలిదండ్రులను కోల్పోయింది. విషాదకరమైన ఈ సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత, 16 ఏళ్ల వనీష్ తన CBSE 10 వ తరగతి పరీక్ష ఫలితాలను అందుకుంది. ఆమెకు సైన్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ మరియు సంస్కృతం అనే నాలుగు సబ్జెక్టులలో పూర్తి మార్కులు లభించాయి. CBSE 2021 క్లాస్‌లో గణితంలో వనిషా 97 మార్కులు సాధించింది.
వనిషా ఇప్పుడు తనకు జరిగిన నష్టం గురించి తన భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఓ కవిత్వం రాసింది. తన తల్లిదండ్రులకు ఒక కవితను అంకితం చేస్తూ, “మీరు లేకుండా నేను ఒక బలమైన అమ్మాయిగా ఉంటాను డాడీ,” అని ఆమె వ్రాసింది, ఆమె తల్లిదండ్రులిద్దరినీ కోవిడ్‌తో కోల్పోయిన తర్వాత, కన్నీళ్ల స్థానంలో ఈ మాటలు ప్రవహించేలా చేసింది.”నా తండ్రి నన్ను ఐఐటిలో చూడాలని లేదా యుపిఎస్‌సిని ఛేదించి దేశానికి సేవ చేయాలనుకున్నాడు.
అతని కల ఇప్పుడు నా కల” అని ఆమె చెప్పింది. వనీష్ ఇప్పుడు,2023 JEE ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఇవ్వడానికి సిద్ధమవుతుంది. “గ్రాడ్యుయేషన్ తర్వాత నేను సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతాను,”అని ఆమె చెప్పింది.BHEL లోని కార్మెల్ కాన్వెంట్ విద్యార్థిని అయినా వనిషా (16) కేవలం ఒక వారం వ్యవధిలోనే తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. వనిషాకు వివాన్ అనే 10 ఏళ్ల తమ్ముడు ఉన్నాడు మరియు ఇప్పుడు అతనికి తల్లి తండ్రి రెండు తానే అయ్యింది. వనిషా మరియు ఆమె సోదరుడు ఇప్పుడు వారి మామ మరియు అత్తతో నివసిస్తున్నారు.
ఆమె తల్లి సీమ మే 4 న మరణించారు మరియు జితేంద్ర మే 15 న మరణించారు. వనిషా చివరిసారిగా మే 2 న తన తల్లితో, మే 10 న తన తండ్రితో మాట్లాడింది.
వనిషాకు ప్రస్తుతం ప్రేరణకు అతిపెద్ద కారణం తన 10 ఏళ్ల సోదరుడు వివాన్ పాఠక్ అని చెప్పారు. “నేను ఏదో ఒకటి చేయాలి” అని వనిషా చెప్పింది. ఆమె తల్లిదండ్రుల జ్ఞాపకాలు తనను మోటివేట్ చేస్తున్నాయని మరియు ఆమెను మోటివేట్ చేస్తూనే ఉంటాయని ఆమె తెలిపారు.