టాలీవుడ్ లో అతి తక్కువమంది మాత్రమే అని భావించే మూలస్తంభాల్లో ఒకడైన స్టార్ హీరో వెంకటేశ్ యొక్క ‘నారప్ప’ సినిమా రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫారమ్ లో విడుదలయ్యి హిట్ టాక్ సంపాదించింది.తమిళ సినిమా అయినా ‘అసురన్’ యొక్క రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్ నటనకు అభిమానుల నుండి ఎన్నో ప్రశంశలు కురుస్తున్నాయి. అయితే తాజాగా ఒక ప్రోగ్రాం లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ షాకింగ్ విషయాలు పంచుకున్నారు. అతను గతంలో కథలు ఎంచుకునే విషయంలో ఎలాంటి రిస్కులు తీసుకున్నాడో వివారిస్తూ దివంగత హీరోయిన్ సౌందర్యతో తీసిన ఒక సినిమా గురించి సంచలన విషయాలు చెప్పాడు.
‘పవిత్రబంధం’ అనే మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ ‘సౌందర్య’ కాళ్లు పట్టుకున్న ఒక పోస్టర్ అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని ఒక స్టార్ హీరో స్థానంలో ఉండి ఒక హీరోయిన్ కాళ్లు పట్టుకుంటావా? అని చాలా మంది తిట్టారని , మరియు అగ్రహీరో ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారని ఇలాంటి సినిమాలు అస్సలు ఆడవని కూడా అన్నారని హీరో వెంకటేశ్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.సినిమాలోని కొన్ని పాత్రలు ఆ కథకు తగ్గట్టుగా యాక్టర్స్ అయిన మేము ప్రయోగాలు చేసినాతప్పులేదని తాను ఎప్పుడు కూడా అదే నమ్ముతానని అందుకే ఆ సినిమా లో సౌందర్య కాళ్లు పట్టుకున్న కూడా విమర్శలు వచ్చిన కూడా ఆ సినిమా ఘన విజయం సాధించిందన్నారు. నారప్ప చిత్రాన్ని కూడా అలానే నమ్మి తీశామని వెంకటేశ్ తెలిపారు.
అయితే ఈ చిత్రం విడుదలై 24గంటలు కూడా కాలేదు కానీ నారప్ప పై ఒక రెంజ్ లో ట్రోలింగ్ మొదలైపోయింది. వివాదాలకు చాలా దూరంగా ఉండే వెంకటేష్ నటించిన ఈ నారప్ప చిత్రం మాత్రం వివాదాస్పదమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం నారప్పలొని కొన్ని సన్నివేశాలు అని అర్ధమవుతుంది. సాధారణంగా ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కథలకు చాలా దూరంగా ఉండే వెంకటేష్ సినిమాలపై ఇలాంటి కాంట్రావెర్సీలు అతితక్కువే. అందుకే వెంకీ మామా సినిమాలంటే ఫామిలీ మొత్తం కలిసి చూసే ఫ్యామాలీ మూవీస్ అంటుంటారు అతని అభిమానులు.
కానీ ఇటీవలే రిలీజ్ అయినా నారప్ప సినిమాలోని కొన్నిసీన్స్ పై సోషల్ మీడియాలో కొత్త వివాదం మొదలవుతుంది. ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యింది.అయితే వివాదాలు ఎన్ని వస్తున్నప్పటికీ వెంకీ మామ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.అయితే ఏది ఏమైనా ఏది కూడా ఒక ఎమోషనల్ జర్నీ అంటూ చాల మంది పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.ఈ నారప్ప మూవీ కథ పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ మూవీకి ఇది రీమేక్. అయితే అసురన్ లో తమిళ్ ప్రాంతీయతకు సింక్ అయ్యే కొన్ని వివాద సన్నివేశాలుంటాయి.