Venkatesh family

హీరో వెంకటేష్ గారి కుమార్తెల గురించి ఆపాలనుకున్న ఆగని ఆసక్తికరమైన విషయాలు.

News

సమారుగా 4 దశాబ్దాల నుండి తన నటనతో మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన విక్టరీ వెంకటేష్ ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించినప్పటికి సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతు ఉంటారు., రామానాయుడు తనయుడు అయినప్పటికీ ఆడంబరమైన జీవితానికి దూరంగా ఉంటూ ఒక మార్గదర్శిగా ఉంటున్నారు. ఆయనను సాధారణ ప్రేక్షకుడు పరిశీలిస్తే వెంకటేష్ గారు సాధారణం గా షోలు చేసినట్టు కనిపించరు. వెంకటేష్ ఎప్పుడు తన పని ఏంటో అది చూసుకుని కొనసాగుతు ఉంటాడని ఆయన కెరియర్ ని పరిశీలించిన వారికి తెలుస్తుంది.

Venkatesh family

ఇతర సీనియర్ యాక్టర్లు తమ కుటుంబ విషయాలను తెలియజేసినట్టు వెంకటేష్ తన కుటుంబ విషయాలు ఏవీ కూడా ప్రజలలో పంచుకోకుండా గోప్యంగా ఉంచుతూ వచ్చారు . తన కుటుంబాన్ని ఎన్నడూ కూడా బయటికి లాగ లేదు మరియు బయటి విషయాలు తన కుటుంబానికి తెలియనివ్వలేదు అన్నట్టుగా ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని మలుచుకున్నారు.

వెంకటేష్ గారు ఏపీ మాజీమంత్రి ప్రస్తుత బీజేపీ నేత అయిన కామినేని శ్రీనివాస్ మేనకోడలు అయినా నీరజ ను వివాహము చేసుకున్నరు. వీరికి ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. మొదట్లో ఒకరి వెంట ఒకరు అమ్మాయిలు పుడుతూ ఉన్నప్పటికీ వారసుని కానే అంతవరకు వెంకీ దంపతులు ఎదురు చూశారు. అయితే వెంకీ తన సంతానాన్ని గురించి ఎన్నడూ కూడా ఈవెంట్ లో గాని సినిమాల్లో గాని ఏ ఇతర షోలో గానీ ప్రస్తావించలేదు తన కూతురుల గురించి తానెప్పుడూ బయటకి చెప్పలేదు అదే రీతిగా తమ తండ్రి మాటను జవదాటని కూతురులు గా ఎన్నడూ కూడా పబ్లిక్ ఫంక్షన్లకు హాజరు అవ్వలేదు.

అయితే ఎంత గోప్యంగా ఉన్నా తన కూతురుల పెళ్లి విషయంలో మొదట్లో విపరీతమైన పుకార్లు వచ్చాయి. పెద్ద కుమార్తె ఎవర్నో ప్రేమిస్తుంది అంటూ రకరకాల కథనాలు బయటికి వచ్చాయి. వెంకటేష్ గారు ఆ పుకార్లను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసిన ఆగకుండా దుమారం రేపాయి. చివరగా వచ్చిన పుకార్ల రీతిగానే పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వెంకటేష్ రెండవ కూతురు రేస్ క్లబ్ చైర్మన్ అయిన ఆర్ సుందర్ రెడ్డి మనవడి తో ప్రేమలో పడ్డ విషయం కూడా సంచలనం సృష్టించింది సురేష్ బాబు గారి మధ్యవర్తిత్వంతో వారిద్దరికీ వివాహము జరిగింది.

అయితే తనకు మొదటి నుండి ఉన్న అలవాటు ప్రకారం బయటి ప్రపంచంలో తమ విషయంలో ఎన్ని పుకార్లు పుట్టిన వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే లక్షణం వల్ల తన పిల్లల పైన వచ్చిన పుకార్లను కూడా పట్టించుకోలేదు.

ఇంక తన మూడో కూతురు ఇప్పుడు చదువుకుంటుంది మరియు తన కుమారుడు ప్రస్తుతం 19 సంవత్సరాల వయస్సు గల వాడు తాను కూడా చదువుకుంటున్నాడు. అయితే తన కుమారుడి యొక్క సినిమా ప్రస్థానం గురించి ఇంకా ఏ అభిప్రాయము తీసుకోలేదని అని వెంకటేష్ గారు తెలియజేశారు.

తన వారసులెవరు సినిమాల్లో లేనప్పటికీ వయసు 60 ఏళ్లు పైబడినప్పటికీ గత 45 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ప్రజలను అలరించారో అదే జోష్ తో ప్రజలను అలరిస్తూనే ఉన్నాడు విక్టరీ వెంకటేష్. చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన నారప్ప తో ప్రేక్షకులను అమితంగా మెప్పించిన వెంకీ త్వరలో దృశ్యం సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published.