తెలుగు చిత్ర పరిశ్రమలో తమదంటూ ఒక గుర్తింపు కలిగిన కామెడియన్లలో వేణు మాధవ్ ఒకరు. ఈయన స్క్రీన్ పై ఉన్నారంటే నవ్వులు పుయ్యల్సిందే. చిన్న నుండి పెద్ద వరకు వేణు మాధవ్ కామెడీ అంటే ఇష్ట పడని వారు ఉండరు.
ఆయన మొదటి సారిగా 1996 లో ఎన్.వి. కృష్ణ రెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సంప్రదాయం సినిమాతో సినీ పరిశ్రమలో అరంగేట్రం చేశారు 1996 లో నుండి ఇప్పటి వరకు మనకు కామెడీ అందించిన వారు వేణుమాధవ్ అలి బ్రహ్మ నందం గార్లు మాత్రమే, వీరందరిది సినిమా పరిశ్రమలో ఎవరితో పోల్చలేని నటన, వీరి స్థానాన్ని వేరే ఎవరూ కూడా తీసుకోలేనంతగా విరు సినిమా తెరపై తమ నటనతో చీర స్తాయిగా నిలిచిపోయే ప్రదర్శన ఇచ్చారు ఇస్తున్నారు కూడా.
అయితే వేణు మాధవ్ గారికి మంచి గుర్తింపును ఇచ్చిన సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలిప్రేమ సినిమా అప్పటి నుండి సుమారుగా 170 సినిమాల్లో నటించిన వేణు మాధవ్ గారు 2019 లో ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు.
ఇప్పటికీ ఆయన మరణ వార్తను గుర్తు చేసుకుంటూ ఆయన మరణించాల్సింది కాదు ఆయనను ఇంక సినిమాల్లో చూడాలని ఉంది ఆయన నటన ఆయన నవించడం అంత కూడా నినట్టి లాగానే అనిపిస్తుంది అని అబిమానులు తిరిగి రాని వేణు మాధవ్ గురించి సుమారుగా 2 ఎండ్ల నుండి బాధపడుతూనే ఉన్నారు. ఆయన 49 యేండ్ల చిన్న జీవిత కాలం లో మనం మాట్లాడుకొంటు నవ్వుకునే రీతిగా అద్భుత మైన సినిమాలు మనకోసం వదిలి వెళ్ళాడు వాటిలో ఫుల్ గా ఫన్ జెనరేట్ చేసినవి ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి సినిమాలు ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించారు.

ఆయన అద్భుత మైన ప్రదర్శనకు 2006 లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేణు మాధవ్ నటనను గుర్తించి ఉత్తమ హాస్య నటుడుగా ఆయనను నంది అవార్డ్ తో సత్కరించారు. ఈ అవార్డ్ అందుకున్న దశాబ్దానికి అంటే 2016 లో ఆయనను ఆకరిసారిగా డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ సినిమా లో స్క్రీన్ పైన చూశాము ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు బహుశా అనారోగ్యం వల్ల కావొచ్చు అని అబిమానులు అభిప్రాయ పడ్డారు.
కొంత మందైతే తాను సినిమాల్లో కనిపించక పోయేసరికి ఆయన చనిపోయారు అన్న ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు దీన్నితో వేణుమాధవ్ కన్నీరు పెట్టుకున్నారు. బ్రతికున్న మనిషి గురించి ఇట్లా ప్రచారం చేయడం తప్పని ఒక న్యూస్ ఛానల్ లో తెలియ జేశారు.

అయితే ఆయన ఎంత గొప్పగా ఎదిగిన పుట్టిన ఊరికి సేవ చేయాలి రుణం తీర్చుకోవాలని అనే గొప్ప సంకల్పం తో తన సొంత నియోజకర్గమైన కోదాడలో 2014 లో ఎమ్మెల్యే పదవి కోసం నామినేషన్ కూడా వేశారట కానీ ఏదో కారణాల వల్ల ఆ నామినేషన్ వెన్నకి తెస్కున్నరట. కానీ చివరిగా ఆయన చనిపోయే వరకు అయా ఒక్క చిన్న పదవి కూడా సంపాదించు కోలేక పోయారు దీంతో తన వారికి సేవ చేయాలనే కల నెరవేరలేదు తన చివరి కోరిక తీరకుండానే చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరం. తన మనసుల్లో ఉన్న కోరిక గురించి తెల్సుకున్న అభిమానుల దుఃఖానికి అవదులు లేవు.