victory-venkatesh-naga-chaitanya

సమంత – నాగ చైతన్య విడాకుల వెంకీ మామా ఎమోషనల్ పోస్ట్.. కాస్త బుర్ర వాడాలి

News

ముందు కొంచెం బుర్ర వాడండి .. సమంత నాగ చైతన్యల విడాకులపై వెంకటేష్ కౌంటర్! కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య సమంతాలు ట్రెండ్ అవుతున్నారు.ముఖ్యంగా వారి విడాకుల విషయంలో చాలా వార్తలు వచ్చాయి. కోర్టు ద్వారా ఎన్నో కౌన్సిలింగ్ లు జరిగాక చైతన్య సమంత లు గత శనివారం తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నామని ఇకపై మంచి స్నేహితులుగా ఉంటామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈ విషయంపై సినీ వర్గాల్లో మరిన్ని చర్చలు మొదలయ్యాయి. అయితే సినిమా పరిశ్రమలో వారికి తాము ఎందుకు విడిపోతున్నాము అని ఎవరి మనోగతం వారు చెప్పుకున్నప్పటికీ , వెన్నుపోటు దారులగా సమంత గురించి సినిమా పరిశ్రమలోనీ కొంత మంది సమంత పరువుకు భంగం వాటిల్లే రీతిగా రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. సొంత వాళ్ళు అనుకున్న సినిమా వాళ్ళే కాక అటు మీడియా వాళ్లు కూడా సమంతను వెంటాడుతూ ఎన్నో రకాలైన కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నారు .

victory-venkatesh-naga-chaitanya

ఇవన్నీ గమనిస్తున్న ప్రేక్షకులు అసలు నిందితుడు ఎవరు? అక్కినేని కుటుంబాన్ని సమంత ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కన్ను పరుస్తున్నారు.

సమంత మరియు నాగ చైతన్య ముందుగానే తమ ప్రైవసీ కి భంగం కలిగించవద్దని అభిమానులను, మీడియాను కోరుకున్నప్పటికీ సమంత నాగచైతన్య లకు మనశ్శాంతి లేకుండా రకరకాల వదంతులను వారిపైన వదులుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్టరీ వెంకటేష్ తన సోషల్ మీడియాలో రాసిన ఒక కొటేషన్ వైరల్ అయింది. ఏ సమస్యపైనా అయిన మౌనంగా ఉండే వెంకటేష్ .. ఇప్పుడు తన ఇన్‌స్టా స్టోరీగా ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు కాస్త బుర్ర కూడా పెట్టాలి అని ఒక పోస్ట్ చేసి. ఆపై మరొక పోస్ట్‌లో ‘మనసు అనేది ఆలోచన పుట్ట.. మన వెళ్లే మార్గాని జాగ‍్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టాడు ఆ కొటేషన్‌లు చూసిన వారు , నాగచైతన్య సమంత ల విడాకుల విషయంలో పరోక్షంగ వెంకటేష్ గారు సెటైర్లు వేస్తున్నారని ప్రేక్షకులు భావించారు.

అలాగే మరో స్టేటస్ లో “మీరు నోరు తెరవడానికి ముందు కొంచెం నోరు తెరవాలి” అని సున్నితమైన సందేశంతో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారందరి నోటిని మూసేందుకు వెంకటేష్ ప్రయత్నించారు. ప్రస్తుతం జరుగుతున్న అలజడిని ఆపేందుకు వెంకటేష్ గారు ప్రయత్నం చేస్తున్నారని ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం తను పెట్టిన ప్రతి స్టేటస్ లు వైరల్ అవ్తున్నయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *