vijay

హీరో విజయ్ పై దేశద్రోహి ముద్రవేసిన కోర్టు.

News

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో జోసెఫ్ విజయ్ 2012లో ఇంగ్లాండ్ నుండి ఒక లగ్జరీ రోల్స్ రాయిస్ కార్ ని దిగుమతి చేసుకున్నాడు. అయితే తాను దిగుమతి చేసుకున్న ఈ కారు విషయమై తాజాగా సుమారు ఆరు ఏడు నెలల నుండి వరుస చర్చల్లో ఉంటున్నారు.

దానికి కారణం ఆయన దిగుమతి చేసుకున్న తర్వాత ఈ కారుకు కట్టాల్సిన పన్ను ఆయన చెల్లించలేదని ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఆరోపణలు ఏదురుకోవటమే.

ఈ విషయం పై గతంలో కోర్టు స్పందిస్తూ ఆ కారుకు సంబంధించి ఎంట్రీ టాక్స్ కట్టలేదని ఇప్పుడు ఖచ్చితంగా కట్టాలని మరియు టాక్స్ కట్టే విషయంలో లేట్ చేసినందుకు అదనంగా లక్ష రూపాయల ఫైన్ కూడా ఆయనకు విధిస్తూ, మీరు సినిమాల్లో మాత్రమే కాక నిజజీవితంలో కూడా హీరో అనిపించుకోండి, దేశ విద్రోహక శక్తి లాగా ఉండకండి అంటూ కోర్టు తన తీర్పును వెల్లడించింది,

కోర్టు తనను దేశ విద్రోహక శక్తిగా పరిగణించినందుకు విజయ్ అత్యంత ఆగ్ర హితుడై, తనని దేశ విద్రోహక శక్తిగా పరిగణించడం అంగీకరించబోనని తన లాయర్ ద్వారా ఆ తీర్పులో తనను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలు అన్నిటినీ తొలగించాలని పిటిషన్ దాఖలు చేశాడు.

vijay

జోసెఫ్ విజయ్ యొక్క న్యాయవాది అయిన విజయ నారాయణ అక్టోబర్ 25న హీరో విజయ్ తరఫున వాదనను ఆయన ఈ రకంగా వినిపించాడు, గతంలో జడ్జి ఇచ్చిన తీర్పులో తనను వ్యక్తిగతంగా విమర్శించి నట్టుగా ఉన్నాయని ఆ పదాలు తొలగించాలని అని , విజయ్ కు టాక్స్ ఎగ్గొట్టడానికి ఉద్దేశం లేదని ఇదివరకే దిగుమతి చేసుకునేందుకు సుంఖము చెల్లించాడని, ఎంట్రీ టాక్స్ మినహాయించాలని కోరారని.

గతంలో వెలువడిన తీర్పులో విజయ్ తన వృత్తిని తెలియజేయలేదని న్యాయవాది తప్పు పట్టడం సరికాదని, తన పిటిషన్ లో వృత్తిని గురించి ప్రస్తావించల్సిన అవసరమే లేదని, కోర్టు తీర్పు ప్రకారం ఆయన లక్ష జరిమానా చెల్లిస్తాడని అవసరమైతే రెండు కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడని అని, కానీ తమ హీరోను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీర్పు నుండి తొలగించాలని, న్యాయమూర్తులుగా ఉన్నవారు ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించి తనను అసభ్యకరంగా కించపరిచిన ప్రతి పదాన్ని తొలగించాలని కోర్టును కోరారు.

మరియు విజయ్ ఒక లగ్జరీ కారు కొన్నాడని జడ్జి తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఆయన శ్రమించి ఎంతో కష్టంతో కారు కొన్నారు, టాక్స్ విషయంలో ఎగ్గొట్టే ఉద్దేశం లేక సామాన్య వ్యక్తి లాగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు, అయితే తీర్పు ఇచ్చే న్యాయవాది ఆయనను జాతి వ్యతిరేకి అని ముద్రించారు ఒక జడ్జి ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు.

కేవలం తమిళనాటనే కొంతమంది న్యాయవాదులు ఈ రకంగా కొంత మంది హీరోలను వారి వృత్తిలో అలాగే టాక్సీలు ఎగొడ్తరని విమర్శిస్తున్నారని , విజయ్ తరఫున న్యాయవాది మాట్లాడారు.

ఈ వాదనలు విన్న న్యాయమూర్తులు సత్యనారాయణ , మహమ్మద్ షఫీక్ తదుపరి కోర్టు స్టేషన్ నిరవధిక వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *