ఒకప్పుడు RGV హీరో.. ఇప్పుడు పెద్ద జీరో.. ఆ వర్మ నాకు కనిపించట్లేదు అంటూ రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్.!

News Trending

రామ్ గోపాల్ వర్మ దేశంలోని అత్యుత్తమ చిత్రనిర్మాతలలో ఒకరు. అయితే, అతని కొత్త ప్రాజెక్ట్‌లపై ప్రేక్షకులు ఆసక్తి చూపే రోజులు పోయాయి. కొంత కాలంగా, ప్రజలు RGV ని పూర్తిగా విస్మరించడం ప్రారంభించారు. ఫిల్మ్ మేకింగ్ లేదా ట్వీట్లు పోస్ట్ చేయడం ద్వారా, RGV ఎల్లప్పుడూ వివాదాలకు దారి తీస్తున్నాడు. గతంలో పలుమార్లు, ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల ప్రజలు నిప్పులు చెరిగారు.

RGV కొంతమంది వ్యక్తులపై వ్యంగ్యాస్త్రాలను పోస్ట్ చేసినప్పటికీ, అతను కొన్నిసార్లు సరైన ప్రశ్నలను కూడా సంధిస్తాడు. గతంలో అతను దేశంలో కరోనా సంక్షోభాన్ని సరిగ్గా నిర్వహించనందుకు ప్రధాని నరేంద్ర మోడీని కూడా విమర్శించాడు.గత కొన్ని రోజులుగా, మోదీ దేశాన్ని సంక్షోభంలో పడేసిన తీరు గురించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

గత సంవత్సరం, మోదీ ఆత్మనిర్భర్ భారత్ (స్వయం ఆధారిత భారతదేశం) అనే భావనతో ముందుకు వచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం ఇతర దేశాల నుండి సహాయం కోరడం తనకు నచ్చనట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

ఇదిలా ఉండగా తాజాగా సునీల్ కనబడుటలేదు అనే సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిధులుగా RGV మరియు ఎస్ ఎస్ రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గార్లు పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో RGV తనదైన శైలిలో అందిరి మీద సెటైర్లు వేశారు.

అతను ఏదైనా సినిమా హీరోయిన్ల కోసమే చుస్తాడంటూ అందరిని నవ్వించాడు. తరువాత RGV రాజమౌళి గారి నాన్న గారితో ఒక ఆట ఆడుకున్నాడు.

విజయేంద్ర ప్రసాద్ గారిని చూస్తూ మీరు ఎందుకు అంతలా గడ్డం పెంచుతున్నారు. మోడీగారు మీకు స్ఫూర్తా.? లేదా రామాయణం కంటే గొప్ప కథ తో బాహుబలి లాంటి సినిమా ను తీసినందుకు రామాయణం రచయిత వాల్మీకి కంటే గడ్డం పెద్దగా ఉండాలని అనుకున్నారా ఏంటి..? లేదా బోడి నా కొడుకే అంత పెంచుతుంటే నేను ఎంత పెంచాలి అనుకున్నారా” అంటూ రాజమౌళి నాన్న గారిని ఒక ఆట ఆడుకునేసరికి విజయేంద్ర ప్రసాద్ చేతులెత్తి దండం పెట్టేసాడు.

తరువాత RGV గారిని ఉద్దేశిస్తూ విజయేంద్ర ప్రసాద్ “సైకిల్ చైన్ తో సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన రామ్ గోపాల్ వర్మ నాకు కనిపించటం లేదు. శ్రేదేవి అందాలను అతని కంటే బాగా ఎవరు చూపించలేదు. ఆ రామ్ గోపాల్ వర్మ నాకు కనిపించట్లేదు.ఎన్నో వినూత్నమైన కథలతో సినిమాలతో విజయాన్ని సాధించినా RGV నాకు కనిపించటం లేదు.

అంతే కాదు ఎటువంటి సినిమా ఎక్సపీరియన్సు గాని ఎక్కడ పని చేసిన అనుభవం గాని లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి ఎన్నో రికార్డులను తిరగరాసిన ఆ RGV ఏమైపోయాడో నాకు కనిపించట్లేదు” అంటూ రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *