ఏరా ర‌వి అంటూ లిమిట్స్ క్రాస్ చేసిన విష్ణుప్రియా.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ర‌వి…!

Movie News

యాంకర్ విష్ణుప్రియ గా తెలుగు బుల్లితెరకు పరిచయం అయిన ఈ భామకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో ఆమెను ఫాల్లో అయ్యే అందరికీ బాగా తెలుసు. విష్ణుప్రియ అటు బుల్లితెరపైన మరియు సోకల్ మీడియాలోను చేసే ఆమె అందాల జాతరకు జనాలు ఫిదా అవ్వడంతో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

ఆమె తన నడుమును తిప్పుతూ పోస్టులు పెట్టె వీడియోలు అందరినీ ఆకట్టుకుంటు ఉంటాయి కూడా.ఆమె ఎక్కువగా తన నడుము అందాలను ప్రదర్శిస్తుంటుంది మరియు అంతే కాకుండా తన జీరో సైజ్ గురించి తన సోషల్ మీడియాలో అభిమానులకు చెబుతూ ఉంటుంది.ఇది పక్కన పెడితే తాజాగా విష్ణుప్రియ తన గురించి చెప్పుకుంటూ తన పరువే తీసుకుంది. అయితే తాజాగా యాంకర్ విష్ణుప్రియ ఓంకార్ హిస్ట్ చేస్తున్న షోలో అతిథిగా వచ్చింది.

ఓంకార్ నిర్వహిస్తున్న sixth sense అనే ప్రోగ్రాం కి ప్రముఖ యాంకర్స్ రవి మరియు విష్ణుప్రియ అతిథులుగా వచ్చి పాల్గొన్నారు. వచ్చే శని, ఆదివారాల్లో ప్రసారం అవ్వబోతున్న ఈ ఎపిసోడ్లో విష్ణుప్రియ మరియు రవి ఇద్దరు కలిసి దుమ్ములేపినట్టున్నారు. అయితే విష్ణుప్రియ ఎక్కువగా యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తు ఫేమస్ అయింది. ఆ తరువాత ఈ భామ బుల్లితెర పైన యాంకర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ టైంలోనే ఆమె వెండితెరపై కూడా హీరోయిన్‌గా నటించేందుకు చాన్సులు కొట్టేసింది. అలా ఆమె మొత్తానికి యాంకర్‌గాను, నటిగాను మంచి దూకుడుమీదుంది.

అయితే ఇదిలా ఉండగా తాజాగా ఓంకార్ షోలో పాల్గొన్న విష్ణుప్రియ తన పరువు తానే తీసుకుంది. తనకు యాక్టింగ్ తో పాటుగా యాంకరింగ్ కూడా రాదని చెప్పుకుంది. ఇన్నాళ్లకు నిజం తెలుసుకున్నావ్ అంటూ రవి ఆమె పైన వెటకారంగా సెటైర్ వేసేశాడు.ఇదేమైనప్పటికి మొత్తానికి యాంకర్లు విష్ణుప్రియ మరియు రవిల కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అంటున్నారు జనం. అరుంధతిలా మారి విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ చేయడంతో యాంకర్ రవి ఆమె పై కౌంటర్లు వేశాడు. విష్ణుప్రియ మరింత రెచ్చిపోతు రవిని ఏరా అని సంభోదించింది.దానికి రవి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్లు ఆ వీడియోలో చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *