విషాదంలో యష్ మాస్టర్.! బ్లడ్ కాన్సర్ వెంటనే 12 మంది రక్తం ఎక్కించాలి..కంట తడి పెట్టిస్తున్న వీడియో..!

News Trending

తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ యశ్ మాస్టర్ గురించి తెలుసు. ఢీ శకలో ఒక మాములు కాంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. అంతే కాకుండా ఆయన ఇటీవలే ఓంకార్ హోస్ట్ చేసిన డాన్స్ ప్లస్ అనే ప్రోగ్రాంకు జడ్జిగా కూడా పని చేసాడు. అయితే ఇప్పుడు ఈ యష్ మాస్టర్ తీవ్ర విషాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెలితే..

ఆంధ్రప్రదేశ్ కి చెందిన అనంతపురం జిల్లాలోని గుత్తి లో జన్మించిన యష్ మాస్టర్ కి చిన్నప్పటి నుండే డాన్స్ అంటే ప్రాణం. హుబ్లీలో తన చదువు పూర్తి చేసుకొని కన్నడ రియాలిటీ షో అయిన డాన్స్ఇంగ్ స్టార్స్ అనే ప్రోగ్రాంలో కాంటెస్టెంట్ గా చేరాడు. తరువాత ఢీ షోలో ఆసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసాడు.


మొదట్లో అతను క్యాట్ మాస్టర్ దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన తర్వాత అతను సొంతంగా ఒక టీంను ఏర్పరచుకొని కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తాడు. తన ప్రతిభాతో తో తక్కువ కాలంలోనే యశ్వంత్ మాస్టర్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

యూటర్న్ సినిమాతో అతను పూర్తి స్థాయి కొరియోగ్రాఫర్ గా మారాడు.తరువాతే రీసెంట్ గా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు.

అయితే తాజాగా యష్ మాస్టర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఒక వీడియో అందరిని కంట తడి పెట్టిస్తుంది. అతని దగ్గర పనిచేసే కేవల్ అనే డాన్స్ మాస్టర్ కు బ్లడ్ కాన్సర్ వచ్చింది అని అతన్ని హాస్పిటల్ లో చేరిపించామని అయితే అర్జెంట్ గా అతనికి ఒక 12 మంది బ్లడ్ అవసరం అని అన్నారు. ఇలాంటి వీడియో తాను చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు యష్ మాస్టర్. తిరుపతి మరియు చెన్నై ప్రాంతాలలో ఉండేవారు వెంటనే హాస్పిటల్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేయాలని కోరాడు.

మేము ఇప్పటికే బ్లడ్ డొనేట్ చేశామని మీరు కూడా ఈ మంచి పని చేసిన అతని ప్రాణాలు కాపాడండి అంటూ ఎమోషనల్ అయిపోయారు.అయితే దీనికి సంబంధించి నటి ప్రియమణి గారు కూడా స్పందించారు, కేవల్ కి వెంటనే సహాయం చేసి అతని ప్రాణాలు కాపడవాలిసిందిగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా తన అభిమానులను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *